ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిత్తూరు జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2019, 04:11 PM

చిత్తూరు జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతో వారు రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు. ఈ ప్రేమ జంట చనిపోయే ముందు సెల్ఫీ తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది.తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మొరవపల్లి గ్రామానికి చెందిన రెండు వేర్వేరు కులాలకు చెందిన యువతీ యువకులు ప్రేమించుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ విషయాన్ని పెద్దల వద్ద చెప్పగా, వారు పెళ్లికి అంగీకరించలేదు.


దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, చనిపోయే ముందు సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత రైలు కింద పడి చనిపోయారు. ఈ సెల్ఫీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ప్రేమ జంటకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com