ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఊరంతా ఒకదారైతే, ఉలిపికట్టెది మరోదారి ఆలీబాబా శ్రమ దోపిడీ

international |  Suryaa Desk  | Published : Sat, Apr 13, 2019, 08:11 PM

ఆలీబాబా గ్రూప్‌లో మీరు ఉద్యోగాలు చేయాలంటే వారంలో ఆరు రోజుల పాటు రోజుకు 12 గంటల చొప్పున పనిచేయాలి’  అని కంపెనీ అంతర్గత సమావేశంలో చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ కంపెనీ బాస్ జాక్ మా ఉద్యోగులపై పెద్ద బండ వేశాడు. అంతటితో ఆగకుండా ‘8 గంటలు పనిచేసే ఉద్యోగులు కంపెనీకి అవసరం లేదని, ఆ ధోరణి పోవాలి. అందరూ ‘996’ పని సంస్కృతి అలవాటు చేసుకోవాలి.  అలా పనిచేయడం అదృష్టం.. మీరు ఆలీబాబా గ్రూప్‌లో చేరాలనుకుంటే రోజుకు 12గంటల పాటు పనిచేయడానికి సిద్ధంగా ఉండండి. లేకపోతే మీరు చేరనందుకు బాధపడాల్సిన అవసరం లేదు’ అని ఆలీబాబా వైబో అకౌంట్‌లోనూ తేల్చేశాడు. 996 అంటే.. పొద్దున 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, వారంలో 6 రోజులూ పని చేయాని అర్థం. జాక్ మాపై చైనాలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగులను ఇలా బెదిరించడం సరికాదని, ఒకరి స్వార్థం కోసం వేలమందికి విశ్రాంతి లేకుండా పనిచేయించడం సరికాదని మండిపడుతున్నారు. అంతగా పనిచేస్తే జాక్ సంపదే పెరుగుతుంది కాని, ఉద్యోగుల జీతాలు పెరగవని, అలాంటప్పుడు వారు ఎందుకు 12 గంటలు పని చేయాలని ప్రశ్నిస్తున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com