అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసవాద విదానంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు తెచ్చేందుకు కారణమైన ఫోటోకు ప్రతిష్టాత్మక వరల్డ్ ప్రెస్ ఫొటో అవార్డు లభించింది. మెక్సికో సరిహద్దుల్లో ఈ చిత్రాన్ని గెట్టీ ఫొటోగ్రాఫర్ జాన్ మూరే తీశారు. తమ దేశంలోకి ప్రవేశిస్తున్న వలసదారులను అడ్డుకుంటున్న పోలీసులు, ఓ మహిళను ప్రశ్నిస్తున్న వేళ, ఆమె కన్నబిడ్డ బిక్కమొహం వేసుకుని భయంతో ఏడుస్తున్న చిత్రమిది. వలసదారుల నుంచి వారి పిల్లలను వేరు చూసి, పంజరాల్లో బంధిస్తున్నారన్న విమర్శలను ట్రంప్ సర్కారు ఎదుర్కొందన్న సంగతి తెలిసిందే. జాన్ మూరే తీసిన ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ కాగా, అమెరికా వైఖరిని పలు దేశాలు ప్రశ్నించాయి.