వికీలీక్స్ సహ వ్యవస్థాపకుడు జూలియన్ అస్సాంజేను లండన్ పోలీసులు అరెస్టు చేశారు. లైంగిక వేధింపుల కేసులో స్వీడన్‌కు తీసుకెళ్లడాన్ని తప్పించుకోవడానికి అస్సాంజే ఈక్వేడార్ దౌత్య కార్యాలయంలో ఆశ్రయం పొందాడు. తాజాగా అస్సాంజేకు ఆశ్రయాన్ని ఉపసంహరిస్తున్నామని ఈక్వేడార్ అధ్యక్షుడు లెనిన్ మోరెనో ప్రకటించారు. అస్సాంజే అనేకసార్లు అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించినందున ఆయనకు కల్పించిన ఆశ్రయాన్ని ఉపసంహరిస్తున్నట్లు మోరెనో చెప్పారు. కాగా అస్సాంజేకు కల్పించిన రాజకీయ ఆశ్రయాన్ని ఉపసంహరించడంలో ఈక్వేడార్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని వికిలీక్స్ విమర్శించింది.