ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత చరిత్ర ని తిరగ రాయాల్సిన అవసరం ఉంది

international |  Suryaa Desk  | Published : Wed, Apr 10, 2019, 03:04 AM








అమెరికా,న్యూ జెర్సీ లో గాయత్రీ చేతన  సెంటర్లో  జరిగిన "భారత చరిత్ర ని తిరగ రాయాల్సిన అవసరం" (The need to Rewrite Indian History ) కార్యక్రమం ఫ్రాంకోయిస్ గాటియర్‌  వచ్చిన సందర్భంగా జరిపారు. దీని ఉద్దేశ్యం ఇండియా  పాఠ్యాంశ పుస్తకాలలో పిల్లలకు నేర్పుతున్న భారత చరిత్ర ని తిరగ రాయాల్సిన అవసరం గురించి తన అపార అనుభవం వలన వచ్చిన పరిజ్ఞానం తో, కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాస భారతీయ ప్రముఖులతో పంచుకున్నారు. ఫ్రాంకోయిస్ గాటియర్‌, ఒక ఫ్రెంచ్ రచయిత మరియు జర్నలిస్ట్. ఫ్రాన్స్ లో పుట్టి, తన 18 వ ఏట భారత్ కు మొదటిసారిగా వచ్చారు. తన హిందూయిజం మీద వున్న ఆసక్తి రెట్టిప్పవ్వడంతో,  హిందూయిజం మరియు భారత చరిత్ర మీద పరిశోధనలు జరిపి, తను తెలుసుకున్న విషయాలను భావి తరాలకు అందించటానికి ఇండియా లో పలుచోట్ల మ్యూజియం , అందులో ముఖ్యంగా పుణేలో  శివాజీ మహరాజ్ మ్యూజియం ను ఏర్పాటు చేశారు. 

ఈ కార్యక్రమం సందర్భంగా పిల్లల పుస్తక పాఠ్యాంశాలలో నేర్పుతున్న చరిత్ర పాశ్యాత్యులు భారత దేశ సనాతన ధర్మం మీద దాడి ని ఉద్దేశించి, వారిది పై చేయి అవ్వడానికి వీలుగా మార్చి బోధిస్తున్నారు అని, దాని ముఖ్య ఉద్దేశ్యం భారతీయులకి తమ సనాతన ధర్మాన్ని దూరం చేయడం మరియు చరిత్ర లో జరిగిన దాడులని బోధించడం మాత్రమే అని చెప్పారు. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న రాజుల గురించి, వారి రాజ్యాల గురించి, పరిపాలన దక్షత, పరిపాలన విధానాల గురించి బోధించడం లేదు. ఎంతో పురాతన కట్టడాలు, నగర, పట్టణ, గ్రామ వ్యవస్థ  మరియు వాటిని రూపొందించడానికి వున్న సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చెప్పడం లేదు. 

ఇది భారత ప్రజల ఆత్మ స్థైర్యం, ఆత్మ విశ్వాసం దెబ్బ తీసే విధంగా ఉన్నాయని, ఈ చరిత్రని అసలైన రాజులు, ధర్మం బోధించే విధంగా తిరగ రాయవలసిన అవసరం ఇప్పటి భారతీయులకి మరియు ప్రభుత్వానికి అవసరం వుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రస్తుత భారతీయులు విస్మరిస్తున్నారని, దానికి కారణం తమ గురించి తమకి తెలియకపోవడమే అని, తమ గురించి తాము తెలుకోవాల్సిన ప్రాధాన్యత గురించి తెలిపారు. 

ఇందుకోసం భారతీయులంతా, ముఖ్యంగా హిందువులంతా ఒక్కటవ్వాలని, ఇలాంటి  ప్రభుత్వ సవరణలు (గవర్నమెంట్  రిఫార్మ్స్) తీసుకు రాగల్గిన ప్రభుత్వం ఎన్నుకోవాలని చెప్పారు. భారత దేశాన్ని సరియిన దిశలో తీసుకెళ్లడంలో మోడీ  గారు సక్సెస్ అయ్యారని చెప్పి, మళ్లీ మోడీ ని ఎన్నుకోవాల్సి న ఆవశ్యకత గురించి చెప్పారు!! మళ్లీ భారత ప్రజలు బీజేపీ ని  ఎన్నుకొని మోడీ ని  పూర్తి మెజారిటీ తో గెలిపిస్తారని, లేకపోతే భారత దేశం ఇంకో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లే ప్రమాదం వుందని తెలిపారు. మోడీ గారు మాత్రమే భారత దేశానికి కావాల్సిన చరిత్ర, న్యాయ, రక్షణ వ్యవస్థ, సంవిధాన మార్పులు చేయగలరని చెప్పారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్|| ఎల్లోజిరావు మీరజ్కర్,  డాక్టర్ || చంద్ర కళ కామత్ , ప్రజ్ఞ ప్రిస్టి, ధీరేన్ మెహతా ,  గణేష్ , సత్య దోసపాటి , కునాల్, శ్రీ కృష్ణ రెడ్డి ఏనుగుల , విలాస్ రెడ్డి జంబుల , మధుకర్, అనేక సంఘాల  నేతలు  మరియు అనేక మంది ప్రవాస భారతీయులు  ఉత్సహంగా పాల్గొన్నారు.

 














SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com