బ్రిటన్ రాజదంపతులు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ ఇరువురు కలిసి గిన్నిస్ రికార్డులకు ఎక్కారు.సాధారణంగా రాజకుటుంబీకులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. అయితే అందుకు భిన్నంగా ప్రిన్స్ హ్యారీ దంపతులు ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేశారు.సస్సెక్స్రాయల్ పేరిట ఓపెన్ చేసిన ఈ ఇన్స్టాగ్రామ్ పేజికి ఊహించని స్థాయిలో ఫాలోయర్లు రావడంతో సరికొత్త గిన్నిస్ రికార్డు నమోదు అయ్యింది.వన్ మిలియన్ ఫాలోయర్లను పొందిన ఫాస్టెట్ అకౌంట్‌గా సస్సెక్స్ రాయల్ పేరు పొందింది. పేజీ ప్రారంభించిన కేవలం 5 గంటల 45 నిమిషాల్లోనే ఈ పేజ్ 1 మిలియన్ ఫాలోయర్లను పొందింది.మొత్తం 758000 లైక్స్ రావడం విశేషం. కాగా ఇప్పటి వరకూ 2.6 మిలియన్స్ ఫాలోయర్లను ప్రిన్స్ హ్యారీ దంపతుల పేజ్ దక్కించుకోవడం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పటి దాకా సస్సెక్స్ రాయల్ ఇన్స్టాగ్రామ్ పేజీలో ప్రిన్స్ హ్యారీ దంపతులు ఒక్క పోస్టు కూడా చేయకపో్వడం విశేషం.