ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్‌కప్‌కు న్యూజిలాండ్ టీమ్ ఇదే..

international |  Suryaa Desk  | Published : Wed, Apr 03, 2019, 02:49 PM

 ఈ ఏడాది జరగబోయే వన్డే వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల టీమ్‌ను ప్రకటించింది న్యూజిలాండ్. బ్యాకప్ వికెట్ కీపర్‌గా టామ్ బ్లండెల్‌ను తీసుకోవడం తప్ప మిగతా టీమ్‌లో పెద్దగా ఆశ్చర్యకరమైన నిర్ణయాలు లేవు. నాలుగేళ్ల కిందట జరిగిన వరల్డ్‌కప్‌లో తొలిసారి ఫైనల్ చేరిన కివీస్.. ఆస్ట్రేలియా చేతిలో దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆరుసార్లు సెమీస్‌లోనే ఇంటిదారి పట్టిన రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉంది. ప్రస్తుతం వన్డేల్లో ఇంగ్లండ్, ఇండియా తర్వాత మూడో స్థానంలో న్యూజిలాండ్ ఉంది. కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలోని కివీస్ టీమ్ వరల్డ్‌కప్‌లో నిలకడగా రాణించాలన్న పట్టుదలతో ఉంది. 2015లో తృటిలో మిస్సయిన వరల్డ్‌కప్‌ను ఈసారి ఒడిసి పట్టుకోవాలని భావిస్తున్నది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లలో బ్యాలెన్స్ ఉండేలా టీమ్‌ను ఎంపిక చేశారు. విలియమ్సన్, రాస్ టేలర్, గప్టిల్‌లాంటి అనుభజ్ఞులతో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్ఠంగా ఉంది. అటు బౌల్ట్, సౌథీ, ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీలతో పేస్ బౌలింగ్ విభాగం కూడా ప్రత్యర్థులకు సవాలు విసిరేలా ఉంది. జూన్ 1న కార్డిఫ్‌లో శ్రీలంకతో జరగబోయే మ్యాచ్‌తో న్యూజిలాండ్ తమ వరల్డ్‌కప్ వేటను మొదలుపెట్టనుంది. 


కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, కొలిన్ డి గ్రాండ్‌హోమ్, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, కొలిన్ మన్రో, జిమ్మీ నీషమ్, హెన్రీ నికోల్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, రాస్ టేలర్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com