న్యూఢిల్లి : ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ విడుదలపై స్టే విధించడానికి ఢిల్లి హైకోర్టు నిరాకరించింది. పిఎం నరేంద్ర మోడీ పేర నిర్మించిన మోడీ బయోపిక్ ఈ నెల 5వ తేదీన విడుదల కావలసి ఉండగా చిత్రం విడుదలను నిలిపివేయాలని కోరుతూ ఢిల్లి హైకోర్టులో పిల్ దాఖలైంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉందని, ఈ చిత్రం ఓటర్లపై ప్రభావం చూపుతుందని పిల్లో పేర్కొన్నారు. కాగా ఇదే అంశంపై అలహాబాద్ హైకోర్టులోనూ, బొంబే హైకోర్టులోనూ పిల్స్ దాఖలయ్యాయి.