అమెరికాలోని మైనీ రాష్ట్రంలోని ఓ హాస్పిటల్ లో పనిచేస్తున్న 9మంది నర్సులు ఒకేసారి తల్లులు కాబోతున్నారు. ఏప్రిల్-జులై నెలల మధ్య వారందరికీ డెలివరీలు జరగనున్నాయి. హాస్పిటల్ మేనేజ్ మెంట్ ఈ విషయాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఒకేసారి నర్సులందరూ గర్భం దాల్చడం సంతోషకరంగా ఉందంటూ వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.వారి డెలివరీ డేట్ ను వివిధ రంగుల ఫొటోలలో రాసి వారందరినీ కలిపి ఫొటో తీసి పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ రెస్ఫాన్స్ వస్తుంది. డెలివరీ అయిన తరువాత పిల్లలతో కూడా ఇలాంటి ఫొటో తీసి పెట్టాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.