తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 72,907 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 25,285 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.38 కోట్లు.