ఆమంచిని వైసిపి లో చేర్చుకోవడం తో మనస్తాపం చెందా మీడియా ద్వారా నా భావన ను జగన్ కు వివరిస్తున్నా. తొమ్మిదేళ్లుగా వైసిపిని నియోజకవర్గం లో అభివృద్ధి చేసేందుకు కృషి చేశా. ఆమంచి ఆగడాలను ఎదుర్కొని, కేసులకు తట్టుకుని పార్టీ కోసం పని చేశా. చీరాల లో బిసిలకు సీటు ఇస్తామని జగన్ చెబితే అంగీకరించాను. ఆమంచి వంటి రౌడీ వైసిపి లోకి చేర్చుకోవద్దంటూ జగన్ కు చెప్పాను. అయినా మా అందరి మనోభావాలను దెబ్బ తీసేలా ఆమంచి ని చేర్చుకున్నారు
దుష్టశక్తులను పార్టీ లో చేర్చుకున్న జగన్ అవినీతి కూడా నిజమేనే భావన కలుగుతుంది. తొమ్మిదేళ్ల ఆటు పార్టీకి సేవ చేసిన నాకు జగన్ సమాధానం చెప్పాలి. బహిరంగలేఖ పై జగన్ మూడు రోజుల్లో స్పందించాలి. లేకుంటే పార్టీ కి రాజీనామా చేసి, వైసిపి ఓటమికి పని చేస్తా. ఆమంచి వంటి దుష్టశక్తులను ఓడించేందుకు ప్రజలు కూడా సిద్దంగా ఉన్నారు. జగన్ తీరుతో నా మనసు క్షోభించింది
పార్టీ కోసం నిస్వార్థంగా సేవ చేస్తే కనీసం మాట కూడా చెప్పకుండా చేర్చుకున్నారు. చీరాల లో కొత్త జెండా ఎగురవేయడం ఖాయం, ఆమంచిని ఇంటికి పంపడం ఖాయం. ఈ పోటీలో వెనుకడుగు వేసేది లేదు..వీర మరణం పొందేందుకు కూడా సిద్దంగా ఉన్నాను. జగన్ ఓదార్పు యాత్ర సమయంలో ఆమంచి ఆగడాలు తట్టుకోలేక నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. యన్.ఆర్.ఐ గా ఉన్న నేను అన్నీ వదులుకుని 9యేళ్లుగా పార్టీ కోసం పని చేశా. జగన్ నుంచి నా ప్రశ్నలకు సమాధానం రాకుంటే వైసిపిని వీడతా. అనంతరం కార్యకర్తల తో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా