ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టాలిన్‌పై విరుచుకుపడ్డ కమల్‌

national |  Suryaa Desk  | Published : Mon, Feb 18, 2019, 11:56 AM

 డిఎంకె నేత స్టాలిన్‌, రజనీకాంత్‌లపై రాజకీయ నేతగా మారిన నటుడు, మక్కల్‌ నీది మయ్యం వ్యవస్థాపకుడు కమల్‌ హాసన్‌ విరుచుకుపడ్డారు. చెన్నైలో జరిగిన ఓసమావేశంలో కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ దశాబ్దాలుగా గ్రామ సభలు ఉన్నాయని, ఇటువంటి సమావేశాలను తాను నిర్వహించడం మొదలు పెట్టాక దాన్నే ఇతరులు కాపీ చేయడం ప్రారంభించారని అన్నారు. డిఎంకె అధినేత స్టాలిన్‌ ఇటీవల గ్రామ సభలను నిర్వహించడంతోనే ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే ఎదుగుతున్న పార్టీ నుండి ఇటువంటి కార్యక్రమాలు కాపీ చేయడం సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. మరొక సందర్భంలో తాను అసెంబ్లీకి వెళితే చినిగిన చొక్కా ధరించనని, ఒక వేళ చినిగిపోతే , మరొక చొక్కాను ధరిస్తానని స్టాలిన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయంపై ప్రశ్నించినప్పుడు రజనీకాంత్‌ను ఉద్దేశించి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com