ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌తో క్రికెట్ ఆడొద్దు: సీసీఐ నిర్ణ‌యం

international |  Suryaa Desk  | Published : Mon, Feb 18, 2019, 12:07 AM

ప్రపంచ్ కప్ లో పాకిస్థాన్ తో ఆడకూడదని క్రికెట్ క్లబ్ ఆప్ ఇండియా (సీసీఐ) నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు బీసీసీఐ కి తీర్మానం కూడా పంపించారు. ప్రపంచ్ కప్ 2019లో భాగంగా టీమిండియా – పాకిస్థాన్ మధ్య జూన్ 16 మాంచెస్టర్ లో మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. పుల్వామా దాడిపై అన్ని వర్గాలతో పాటు క్రికెట్ సంఘాలు కూడా ఆగ్రహంగా ఉన్నాయి. ఈ దాడిని యావత్ దేశం ముక్త కంఠంత ఖండిస్తున్నది. సీసీఐ ఆల్ రౌండర్ రెస్టారెంట్ నుంచి పాక్ ప్రధాని, మాజీ క్రికెట్ కేప్టెన్ ఇమ్రాన్ ఖాన్ చిత్రపటాన్ని తొలగించింది. దాడి జరిగిన రోజు నుంచి నేటి వరకు ఈ దారుణంపై మాట్లాడేందుకు ఇమ్రాన్ ఖాన్ ముందుకు రాలేదు. ఉగ్రవాదంపై స్పందించకపోవడంతో సీసీఐ నొచ్చుకున్నది. అమానవీయ దాడిపై ఇమ్రాన్ మాట్లాడాల్సిందేనని సీసీఐ డిమాండ్ చేస్తున్నది. దీనికి నిరసనగా ప్రపంచ కప్ లో ఆడకూడదని నిర్ణయం తీసుకోవడంతో పాటు పాక్ సూపర్ లీగ్ మ్యాచ్ ల ప్రసారాల్ని కూడా నిలిపివేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com