ధర్మవరం మండలం చిగిచెర్ల గ్రామంలో మినీ గోకులానికి సోమవారం భూమి పూజ నిర్వహించారు. గ్రామానికి చెందిన నారాయణస్వామి మినీ గోకులం నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోవడంతో ప్రభుత్వం 1.85 లక్షల ఉపాధి హామీ నిధులు మంజూరు చేసింది.
జడ్పీ మాజీ చైర్మన్ చిగిచెర్ల ఓబిరెడ్డి, ఎంపీడీవో సాయి మనోహర్ లు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని చిగిచెర్ల ఓబిరెడ్డి తెలిపారు.