పిఠాపురాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
పర్యటనలో భాగంగా గొల్లప్రోలులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. పిఠాపురం ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులు చేపడతానని హామిచ్చారు. తక్కువ సమయంలోనే పిఠాపురాన్ని సంపూర్ణాభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.