అనంతపురం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ డివిజనల్ అధికారిగా గుత్తా కేశవ నాయుడు సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఆర్డీవో గుత్తా కేశవ నాయుడు జిల్లాలో వివిధ హోదాల్లో పని చేశారు. రెవెన్యూ డివిజన్లో ప్రజా సమస్యలతో పాటు శాంతి భద్రతలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా విధులు నిర్వహిస్తానని తెలిపారు.