దీపికను నేను అన్ ఫాలో అయ్యాను. ఎందుకంటే ఆమె నా భార్యను అన్ ఫాలో అయ్యారు. నా భార్యకు మర్యాద ఇవ్వనివారికి నేను మర్యాద ఇవ్వనని తెలిపాడు క్రికెటర్..నటుడు శ్రీశాంత్. బిగ్ బాస్ షోలో బుల్లితెర నటి దీపిక కక్కర్..శ్రీశాంంత్ పాల్గొని ఒకరికొకరు మద్దతుగా నిలిచారు. దీపిక అభిమానులు సోషల్‌మీడియాలో శ్రీశాంత్‌పై అతని భార్య భువనేశ్వరిపై అసభ్యకర కామెంట్లు చేస్తున్నారు. దాంతో శ్రీశాంత్‌కు కోపం వచ్చి తాను చెల్లెలిగా భావించే దీపికను సోషల్‌మీడియాలో అన్‌ఫాలో అయ్యారు. నా భార్యే నాకు శక్తి. దీపిక అభిమానులు నన్ను, నా భార్యను నోటికొచ్చినట్లు తిడుతున్నారు. ఆమెను ఎవరైనా తిడితే నేను సహించలేను. అలా తిట్టకూడదని దీపిక వారికి కనీసం ఒక్కమాటైనా చెప్పలేదు. నా అభిమానులు దీపికను తిట్టినప్పుడు నేను వారిని హెచ్చరించాను. ఈ విషయం గురించి నేను దీపికతో చర్చించాలనుకోవడంలేదు. నా తప్పు లేదని తెలియజేయడానికే నేను మీడియా ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టానని శ్రీశాంత్ వెల్లడించాడు.