ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా ?

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Oct 28, 2024, 03:00 PM

చాలామంది, రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఎన్నో సమస్యలు కారణంగా, చాలామంది సఫర్ అవుతున్నారు. ఏదేమైనా అనారోగ్య సమస్యలను అసలు అశ్రద్ధ చేయడం మంచిది కాదు.ఏదైనా సమస్య వచ్చిందంటే, దానిని పరిష్కరించుకోవాలి. లేకపోతే, అనవసరంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. యూరిక్ యాసిడ్ సమస్య చాలా ఎక్కువగా, ఈమధ్య ఉంటోంది. వయసుతో సంబంధం లేకుండా, చాలామంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు.శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే, కిడ్నీలో రాళ్లు ఏర్పడడం మొదలు మోకాళ్ళను నొప్పులు, కీళ్ల నొప్పులు ఇలా అనేక సమస్యలు కలుగుతుంటాయి. యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవడానికి, చాలా మంది మందులు వాడుతున్నారు. రకరకాల మందుల్ని వాడి, తగ్గకపోవడంతో సఫర్ అవుతున్న వాళ్లు కూడా ఉన్నారు. అయితే, ఈ చిట్కాని ఫాలో అవ్వడం మంచిది.


ఇలా కనుక చేశారంటే, యూరిక్ యాసిడ్ సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు. మనం ఆహారం తీసుకున్నాక, ప్యూరిన్ అనే రసాయనం విచ్చిన్నం అయితే యూరిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది, ఇది ఎప్పటికప్పుడు యూరిన్ ద్వారా బయటికి వస్తుంది. ఒకవేళ విసర్జన సరిగ్గా జరగకపోతే, యూరిక్ యాసిడ్ రక్తంలో ఉండిపోతుంది. క్రమంగా అవి స్పటికాలుగా మారిపోయిm కీళ్ల చుట్టూ ఉండే కణజాలలో పేరుకు పోతాయి. ఈ సమస్య వంశపర్యపరంగా వచ్చే అవకాశం కూడా ఉంది.రావి చెట్టు బెరడు ఈ సమస్య నుండి బయటపడడానికి ఉపయోగపడుతుంది. రావి చెట్టు బెరడు కానీ ఆ బెరడు పొడి కానీ తీసుకుంటే, ఎంతో ఉపయోగముంటుంది. మార్కెట్లో ఇది మనకి దొరుకుతుంది. ఒక గిన్నెలో పావు లీటర్ నీళ్లు పోయండి. 10 గ్రాముల రావి చెట్టు బెరడు ముక్కలు వేసి, ఐదు నుండి ఏడు నిమిషాల పాటు మారగపెట్టుకోవాలి ఈ కషాయాన్ని ప్రతిరోజు తాగితే, యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. గోరువెచ్చని నీళ్లలో బ్లాక్ సాల్ట్ కలిపి కీళ్లని మసాజ్ చేస్తే, నొప్పి నుండి రిలీఫ్ ని పొందొచ్చు. ధనియాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఇలా, సులభంగా ఈ సమస్య నుండి బయట పడొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com