ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్‌ చేసిన హ్యారీ బ్రూక్‌

sports |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2024, 10:17 PM

ఇంగ్లాండ్‌‌కు తొలిసారి నాయకత్వం వహిస్తున్న హ్యారీ బ్రూక్‌ ఆసీస్‌పై మరోసారి చెలరేగి ఆడాడు. ఆదివారం ఐదో వన్డేలో బ్రూక్‌ (72; 52 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) అర్ధ శతకం బాదాడు.
ఈ క్రమంలో ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఓ రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పటివరకు ద్వైపాక్షిక సిరీస్‌లో ఆసీస్‌పై అత్యధిక రన్స్‌ చేసిన కెప్టెన్‌గా కోహ్లీ (310) పేరిట రికార్డు ఉండేది. తాజాగా బ్రూక్‌ ఐదు వన్డేల్లో 312 పరుగులు చేసి కోహ్లీని అధిగమించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com