ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ, సీఐటీయూ, ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ అంజిబాబు మాట్లాడుతూ లేబర్ కోడ్లకు నిరసనగా ఈనెల 23న బ్లాక్డే నిర్వహిస్తున్నామన్నారు. నాయకులు ఎస్.మునెప్ప, చంద్రశేఖర్, సాయిబాబా, నాగన్న, శ్రీనివాసరావు, కే.రామకృష్ణ పాల్గొన్నారు.