రాష్ట్రంలో ఎన్నికల తర్వాత భారీ విజయం సొంతం చేసుకున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలు తేల్చాలంటూ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను ఆదేశించింది. రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు రాక్రీట్ ఇన్‌ఫ్రాకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన కేంద్ర నిధులు.. కొనుగోలు చేసిన భారతీ సిమెంటు.. జగనన్న దోపిడీ ఇసుక.. ఇతర మెటీరియల్ లెక్క తేల్చాలని చెప్పింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన పేదల ఇళ్ల నిర్మాణంలో ఎక్కడెక్కడ లోపాలున్నాయి..? అక్రమాలు ఏ మేరకు జరిగాయి.? పేదల ఇంటికి రాక్రీట్ ఎలా కన్నం వేసింది.? కేంద్ర ప్రభుత్వ నిధులు వైసీపీ నేతలు ఏ విధంగా కాజేశారు.? తదితర అంశాలపై విజిలెన్స్ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టింది. మొత్తం 35 కాలనీలకు వెళ్లి ఎన్ని ఇళ్లు పూర్తి అయ్యాయి.. మొండి గోడలతో ఆగినవి ఎన్ని.. పునాదిలోనే అసంపూర్తిగా మిగిలి పోయినవి ఎన్ని.. వాటికి వాడిన మెటీరియల్ తదితర అంశాలపై సమగ్ర నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది.