ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల పిలుపు మేరకు పలువురు సెలబ్రిటీలు విరాళాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన సెలబ్రిటీలు తమ వంతు సాయం ప్రకటించడమే కాక అయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను, డిప్యూటీ సీఎంలను కలిసి తమ విరాళాలను అందజేశారు, ఇప్పటికీ అందజేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ ఆనన్య నాగళ్ల బుధవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని స్వయంగా కలిసి తను సీఎం సహాయనిధికి ప్రకటించిన వరద సాయం రూ.2.5 లక్షలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనన్యను అభినందించారు.