వంటనూనెలపై కస్టమ్స్ సుంకం పెంచే అవకాశం ఉందని పుకార్లు వస్తున్ననేపథ్యంలో ఏపీలో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఈరోజు(మంగళవారం) తనిఖీలు చేపట్టింది పామోలిన్, ఇతర ఎడిబుల్ ఆయిల్ ధరల్లో పెరుగుదల, కల్తీపై ఆకస్మిక తనిఖీలు చేసినట్లు విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. అకస్మాత్తుగా పెరిగిన అనధికార హోర్డింగ్, ట్రేడింగ్‌పై విజిలెన్స్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాన్య వినియోగదారులపై భారంపడే ఆకస్మిక ధరల పెరుగుదలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టినట్లు డీజీ హరీష్ కుమార్ గుప్తా వివరించారు. తప్పుచేసిన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పండుగల సీజన్‌లో ఎడిబుల్ ఆయిల్‌కు డిమాండ్ ఉన్న నేపథ్యంలో మిల్లర్లు, స్టాకిస్ట్‌లు, రిటైలర్లపై ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రాష్ట్రంలోని అన్ని యూనిట్ల ఆర్వీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. 12 యూనిట్ల పరిధిలో 26 జిల్లాలో సుమారు 50 బృందాలతో మిల్లర్లు, స్టాకిస్ట్‌లు, రిటైలర్లు, వ్యాపారులు, సూపర్ మార్కెట్లు, తయారీ యూనిట్లపై ఆకస్మిక తనిఖీలు జరిపినట్లు చెప్పారు. కృత్రిమ కొరతను సృష్టించి, నిబంధనలు అతిక్రమించిన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు.