జగన్... నీరో చక్రవర్తిలా ఇంట్లో కూర్చుని పబ్జీ గేమ్‌లు ఆడుతూ ఐదేళ్లు నెట్టుకొచ్చేశారని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని, వ్యవస్థలను విధ్వంసం చేసిన ఘనత జగన్ దే అని అన్నారు. గత ఏడాది ఇచ్చిన థర్డ్ పార్టీ నివేదిక అమలు చేయకపోవడం వల్లే అచ్యుతాపురంలోని ఎసెన్షియా ఘటనకు కారణమని అన్నారు. శవ రాజకీయాలు చేస్తున్న జగన్ ఇకనైనా వాటిని మానుకోవాలని హితవుపలికారు. ఎసెన్షియా పాపం ముమ్మాటికీ జగన్ దే అని మంత్రి అన్నారు. తమ నాయకుడు చంద్రబాబు వెంటనే స్పందించారని.. ఆగమేఘాల మీద మృతుల కుటుంబాలకు కోటి చొప్పున నష్టపరిహారం అందించారని తెలిపారు. క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను కలిసి చంద్రబాబు భరోసా ఇచ్చారన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడమే కాకుండా నష్టపరిహారం కూడా అందిస్తున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు.