విజయనగరం జిల్లా ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఒక కార్యాచచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ ...... ఇక్కడ ఏ తరహా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చనే అంశంపై అధ్యయనం చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఈనెల 9 నుంచి 15వ తేదీ వరకూ చేపట్టిన హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో భాగంగా ప్రతి పౌరుడు జాతీయ జెండాను ఎగురు వేసి దేశం పట్ల భక్తిని వెల్లడించాలని మంత్రి శ్రీనివాస్ కోరారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెల్పీ పాయింట్ వద్ద జాతీయ జెండాను పట్టుకుని ఉద్యమంలో పాల్గొన్నారు.