ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిందువు అయితే పోటీ చేయకూడదా..?

international |  Suryaa Desk  | Published : Wed, Jan 30, 2019, 08:24 PM

మతాల చిచ్చు భారతోనే కాదు - అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఉంటుందనిమరోసారి రుజువైంది. ఈసారి ఏకంగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ఓ వ్యక్తిపై ఈ తరహా ఆరోపణలు రావడం బాధాకరం. హవాయి దీవులకు చెందిన డెమక్రటిక్ పార్టీ అభ్యర్థి తులసీ గబార్డ్ - అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన విషయం తెలిసిందే. తను కూడా అధ్యక్ష పదవికి పోటీచేస్తానంటూ కొన్ని రోజుల కిందట ఆమెప్రకటించారు. ఆ ప్రకటన వెలువడిన వెంటనే ఆమెపై హిందూ వాది ముద్రవేసే ప్రయత్నం చేశారు రిపబ్లికన్లు. అమెరికాలో పుట్టి - అక్కడే పెరిగిన వ్యక్తి తులసీ గబార్డ్. కాకపోతే హిందూ సనాతన ధర్మ - హిందూమతం అంటే ఆమెకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనేయుక్తవయసులో హిందూ మతాన్ని స్వీకరించారు. కృష్ణుడిని మనసారా ఆరాధిస్తారు. అదే ఆమె పై విమర్శలకు కారణమైంది. 2012లో కాంగ్రెస్ కు ఎన్నికైన తొలి హిందువుగా రికార్డు సృష్టించారు తులసీ గబార్డ్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com