ప్రజల ప్రాణ భద్రత కోసం చేపడుతున్న రోడ్డు భద్రతా చర్యల ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్, ఎస్పీ హర్షవర్ధన్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న రహదారులపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చర్యలను కఠినతరం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.