ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్న చిన్న కళ్లు, చిన్న ముక్కు, నోటితో.. బోసి నవ్వులు నవ్వుతూ,,,అప్పుడే పుట్టిన చిన్నారికి 32 పళ్లు

national |  Suryaa Desk  | Published : Sat, Jul 20, 2024, 10:13 PM

ఓ పాప మాత్రం ఏకంగా 32 పళ్లతో పుట్టడం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర ఆసక్తికరంగా మారింది. ఆ చిన్నారికి సంబంధించిన వీడియోను.. తల్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఇప్పుడు నెటిజన్లు మొత్తం ఆ చిన్నారి గురించే చర్చించుకుంటున్నారు. ఏ మనిషికి అయినా మొత్తం 32 పళ్లు రావడానికి కొన్ని సంవత్సరాల కాలం పడితే.. ఆ చిన్నారికి మాత్రం తల్లి కడుపులో నుంచి బయటికి రాగానే 32 పళ్లు వచ్చేశాయి. ఇప్పుడు ఆ చిన్నారికి ఉన్న 32 పళ్లకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.


అప్పుడే జన్మించిన ఓ బిడ్డకు నోటి నిండా పళ్లు ఉండటం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీసింది. ఆ చిన్నారికి ఉన్న పళ్లకు సంబంధించి.. తల్లి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. చిన్నారులకు ఒక్కొక్కటిగా పాల పళ్లు వస్తాయి కానీ.. ఈ చిన్నారికి మాత్రం ఒకేసారి తల్లి గర్భంలోనే వచ్చేశాయి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆ చిన్నారి పుట్టుకతోనే గట్టి పదార్థాలు నమిలి తినేయొచ్చు అని కొందరు సరదాగా చెబుతున్నారు. ఇంకొందరు మాత్రం ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతున్నారు.


అయితే ఆ వీడియో షేర్ చేయడానికి గల కారణాన్ని తల్లి వెల్లడించింది. పుట్టినప్పటినుంచి ఆ చిన్నారి ఎలా ఉందో మొత్తం ఆ వీడియోలో చూపించారు. అయితే అందరికీ దీనిపై అవగాహన రావడానికే ఈ వీడియోను షేర్ చేసినట్లు ఆ చిన్నారి తల్లి చెప్పారు. అయితే ఇది ఒక ఆరోగ్య పరిస్థితి అని.. డాక్టర్లు చెప్పారని.. దాన్ని నాటల్ టీత్ అంటారని ఆ తల్లి వివరించారు. ఇలా పుట్టుకతోనే పళ్లు ఉండటం వల్ల ఆ బిడ్డకు అంతగా ప్రమాదం ఏమీ లేదని పేర్కొన్నారు. కానీ తల్లి పాలు ఇచ్చేటప్పుడు మాత్రం తనకు ఇబ్బంది అవుతుందని పేర్కొన్నారు. పొరపాటున ఆ చిన్నారికి ఏదైనా జరిగి.. పన్ను విరిగిపోతే.. దాన్ని లోపలికి మింగేసే అవకాశం ఉంటుందని తెలిపారు.


 అయితే డాక్టర్లు మాత్రం చిన్నారికి ఉన్న పళ్లను తొలగించినట్లు తెలుస్తోంది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుగానే ఈ నిర్ణయం తీసుకుని ఆ చిన్నారి పళ్లను పీకేసినట్లు సమాచారం. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు షాక్ అయ్యారు. ఆ చిన్నారి ఆరోగ్యం ఇప్పుడు బాగుందా.. ఆ పాప ఎదుగుతున్నప్పుడు ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా అని అడిగారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com