నెల్లూరు జిల్లా, నాయుడుపేట పట్టణంలోని హోటళ్లు, దాబాల్లో మంగళవారం ఫుడ్ సేప్టీ, మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేప్టీ జిల్లా అధికారి జి.వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ జనార్దన రెడ్డి, పుడ్ ఇన్‌స్పెక్టర్ నర్మద తదితరులు పట్టణంలోని పలు హోటళ్లు, డాబాలలో ఆహార పదార్థాలను, పరిసరాల పరిశుభ్రతను, వంటకు వినియోగించే వస్తువుల నాణ్యతను పరిశీలించారు. హోటల్ అమరావతిలో వంటగది పరిశుభ్రంగా లేదని, తిరుమల హోటల్‌లో వంట గది పరిశుభ్రంగా లేకపోవడంతో పాటు కాలం చెల్లిన ఆహార పదార్థాలు వాడుతున్నారని సీజ్ చేసినట్లు కమిషనర్ జనార్దన రెడ్డి తెలిపారు.మిగిలిన హోటళ్లను, డాబాలను పరిశీలించి పుడ్ సేప్టీ నియమాల మేరకు వంటకు నాణ్యమైన సరుకులనే వాడాలని, వంటగది పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హెచ్చరించారు.