టీటీడీ సంయుక్త కార్యనిర్వహణాధికారిగా సీహెచ్ వెంకయ్య చౌదరి నియమితులయ్యారు. 2005వ సంవత్సరం బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారైన వెంకయ్య చౌదరిని డిప్యుటేషన్‌పై పంపాలన్న రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఆయన మూడేళ్ల పాటు ఏపీలో పనిచేయనున్నారు. గతంలో ఏపీ మినరల్ డెవలె్‌పమెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా వెంకయ్య చౌదరి పనిచేశారు. సాధారణంగా టీటీడీకి ఈవోతో పాటు తిరుమలకు ఒకరు, తిరుపతికి ఒకరు చొప్పున ఇద్దరు జేఈవోలుంటారు. కానీ, గత వైసీపీ ప్రభుత్వం ఇద్దరు జేఈవోలను తిరుపతికే పరిమితం చేసి తిరుమలలో కేవలం ఈవోగా ధర్మారెడ్డిని మాత్రమే కొనసాగించింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం పూర్వపు పద్ధతిలోనే ఈవోతో పాటు తిరుమలకు జేఈవోను యధావిధిగా కొనసాగిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమర్థవంతమైన అధికారిగా పేరున్న వెంకయ్య చౌదరి ఎంట్రీతో టీటీడీలో ఎలాంటి మార్పులు,ఉంటాయో చూడాల్సివుంది.