వర్కింగ్ జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీంను 2024-25 ఆర్థిక సంవత్సరానికి కూడా పొడిగించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. ఈ విషయాన్ని సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీం పొడిగింపునకు సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రతిపాదనలు పంపించగా.. ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. పాత్రికేయుల ఆరోగ్య బీమా ద్వారా జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులకు అనారోగ్యం సంభవించినప్పుడు రూ.2 లక్షల విలువైన వైద్య చికిత్సలు చేయించుకునే వీలుంటుంది. ఇలా సంవత్సరంలో ఎన్నిసార్లైనా పరిమితులు లేకుండా ఈ సదుపాయాన్ని అందిస్తారని హిమాన్షు శుక్లా తెలిపారు.