రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం అటవీ ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టులను శనివారం అరెస్ట్ చేశామని ఎఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఛతీస్గడ్ రాష్ట్రానికి చెందిన భామన్, చింతూరుకు చెందిన నాగేశ్వరావును అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి మందుగుండు సామాగ్రీని స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు. నిందితులు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు ఆయన చెప్పారు.