గ్రామాలలోని ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచడం ద్వారా తమ తమ గ్రామాలను నందనవనంగా మార్చుకోవాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలో శనివారం నాడు గ్రామం చుట్టూ సుమారు 500 కొబ్బరి మొక్కలు, వేప మొక్కలను వేణు -బూన్ యూత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నాటారు. ఈ సందర్భంగా వేణు -బూన్ యూత్ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.