ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 20, 2024, 03:14 PM

శ్రీకాకుళం జిల్లా పరిధిలోని మదనాపురం గ్రామ సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్టు ఎస్‌ఐ జీవీ ప్రసాద్‌ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన సోహాన్‌గౌడ్‌ (32) ప్లాస్టిక్‌ డబ్బాలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తన్నాడు. ఈ క్రమంలో బుధవారం తన ద్విచక్ర వాహనంపై డబ్బాలు అమ్ముకుంటూ పాలకొండ వైపు వెళ్తుండగా.. మదనాపురం వద్ద తన వాహనాన్ని ఆపి దిగుతుండగా అదే మార్గంలో త్రిచక్ర వాహనంతో అతి వేగం వచ్చి సోహాన్‌గౌడ్‌ను బలంగా డీకొట్టారు. దీంతో రోడ్డు మీద పడిన గౌడ్‌ తలకు బలమైన గాయమైంది. అతడిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం జెమ్స్‌ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com