పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం భట్లూరు గ్రామానికి చెందిన వలంటీర్ బాబురావును గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తీవ్రంగా బెదిరించారు. ‘అరేయ్ బాబురావుగా నీ పతనం స్టార్ట్ కాబోతుంది.. ఇక నువ్వు ఫిక్స్ అయిపో.. ఇప్పుడు నీ జీవితం నా చేతుల్లో ఉందిరా.. నిన్ను నువ్వు కాపాడుకోవాలనుకున్నా.. నిన్ను వేరే వాళ్ళు కాపాడాలన్నా.. నీ జీవితాన్ని నేను తిరగరాసినా ఇప్పుడు. నీకు భయం అంటే ఏంటో చూయిస్తారా.. నా కొడకా. అరేయ్ బాబురావుగా.. ఇప్పుడు నీ జీవితం నా చేతుల్లో ఉంది రా.. నీ తలరాత బ్రహ్మ రాసినా ఇప్పుడు నీ జీవితాన్ని నేను తిరగరాస్తా.. కొడకా..’ అంటూ స్టేటస్ పెట్టి మరీ హెచ్చరించారు. మరోవైపు పెదమక్కెన గ్రామంలోని ఎస్సీ కాలనీలో దళితుల ఇళ్లపై టీడీపీ వారు రాళ్లు, సీసాలు విసిరారు. అజయ్‌కుమార్ జీవనాధారమైన ఆటోను ధ్వంసం చేశారు.