ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నగరాన్ని నాశనం చేసాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 09, 2024, 05:28 PM

రాజమహేంద్రవరం లో భరత్‌రామ్‌ను ప్రజలంతా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని సిటీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం రాజమహేంద్రవరంలోని స్థానిక 6, 21, 22, 23, 24, 25, 29, 30, 31, 32, 33 డివిజన్లలో ఆయన, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌ కుమార్‌ , జనసేన నగర అధ్యక్షుడు వై.శ్రీను, మాజీ కార్పొరేటర్లు డివిజన్‌ ఇంచార్జీలతో కలసి రోడ్‌ షో నిర్వహించారు.  ఐదేళ్లలో ఎంపీ భరత్‌రామ్‌ చేసిందేమిటని ప్రశ్నిస్తే ఆవ భూముల స్కాంతో కోట్లు దిగమింగాడని, నగరంలో అభి వృద్ధి పనులు అని చెప్పి అనాలోచితంగా పనులు చేసి ఆయా పనులలో 25 శాతం కమిషన్‌ నొక్కేసారని చెప్పారు. ఈ పనుల సత్తా నిన్న పడిన గంటవర్షానికే ప్రజలకు పూర్తిగా అర్థమైందన్నారు. ఇళ్లలోకి నీరువెళ్లి విలువైన సామా న్లు పాడైపోయాయని, పరిసరాలు దుర్గధంగా మారి చా లా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. నగరంలో ప్రజలకు ఇళ్ల స్థలాల పేరుతో ఎన్నికల కోడ్‌కు ఒకరోజు ముందు ఆగమేఘాలపై భూమిలేని స్థలానికి ఎందుకూ పనికిరాని 25వేల బోగస్‌ పట్టాలను ఇచ్చి ప్రజలను మోసం చేశాడన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో ఏదైన పనులు చేపట్టేటప్పుడు ఆలోచించి ప్రణాళికలువేసి, సలహాలు సూచనలు తీసుకుని చేయాలని కాని అంతా నాఇష్టం నా కు నచ్చినట్టే జరగాలని నగరాన్ని నాశనం చేశాడన్నారు. అవినీతి పరుడైన ఈ రీల్స్‌ స్టార్‌ ప్రజలు ఓడిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ పాలన అంతా అవినీతిమయమైందన్నారు. ఇసుక, మట్టి, మధ్యం మాటును వేలకోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. అన్నివ్యవస్థలను జగన్‌ బ్రష్టు పట్టించాడన్నారు. పన్నుపోటు, అధిక ధరలు, నిరుద్యోగం, కార్పొరేషన్ల నిర్వీర్యం, విద్యుత్‌చార్జీలు పెంపు, నిత్యావసరాల ధరల పెంపు, పోలవరాన్ని పూర్తి చేయకపోవడం, మూడు రాజధానుల పేరుతో నాటకాలు, పేదవారికి పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్లు మూసివేశారన్నారు. సైౖకిల్‌ గుర్తుపై ఓటువేసి తనను ఎమ్మెల్యేగాను, కమలం గుర్తుపై ఓటువేసి దగ్గుబాటి పురందేశ్వరిని ఎంపీగాను గెలిపించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com