మండల కేంద్రం చిట్వేలులో గురువారం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్ ప్రచారం నిర్వహించారు. టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్ రోడ్ షో కార్యక్రమం నిర్వహిస్తుండగా, కూటమి కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి టిడిపి, జనసేన మేనిఫెస్టోలోని కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ సద్దాం టీం సభ్యులు పాల్గొన్నారు.