ఎర్రగొండపాలెంలో రెండు సార్లు పోటీ చేసి ఓటమిని చవిచూసాను, మీ ఇంటి అడపడుచును ఆదరించండి అంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుదాల అజితరావు గురువారం ఎర్రగొండపాలెం మండలంలోని పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని అన్నారు.