ఉరవకొండ నియోజకవర్గంలో వైస్సార్సీపీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకోవడంతో ఊపందుకుంది. గురువారం ఉదయం లత్తవరం గ్రామంలో వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై. విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వైస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం పై వివరించారు. మరోసారి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని కోరారు. అనంతరం రోడ్ షో నిర్వహించారు. ఫ్యాను గుర్తు కు ఓటు వేయాలని అభ్యర్థించారు.