అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బ్యారన్ ట్రంప్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్‌కు ఆయన ఫ్లోరిడా ప్రతినిధిగా వెళ్లనున్నారు. బ్యారన్ ట్రంప్.. వచ్చే వారమే హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ కానున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు డొనాల్డ్ ట్రంప్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. ఆయన ప్రస్తుతం ‘హష్మనీ కేసు’లో విచారణ ఎదుర్కొంటున్నారు.