టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఊహించని మద్దతు దక్కుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణాన.. కూటమికి ముఖ్యంగా పవన్ కల్యాణ్‌కు ఆయన పెద్దన్నయ్య, సినీ హీరో చిరంజీవి సహా ఒకే రోజు ఐదుగురు హీరోలు మద్దతు ప్రకటించారు. పిఠాపురం నుంచి ఎమ్మేల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్‌ను గెలిపించాలని కోరుతూ.. మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో విడుదల చేయగా.. ఆయన కుమారుడు రామ్‌చరణ్, హీరోలు నాని, రాజ్ తరుణ్, తేజ సజ్జా కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జనసైనికుల్లో జోష్ నింపింది.