ప్రధాని నరేంద్ర మోదీపై ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఎన్నికల నియమావళిని ప్రధాని ఉల్లంఘించారని, ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలంటూ పిటిషనర్ పిటిషన్ వేశారు. ఎన్నికల ప్రసంగంలో ప్రధాని హిందూదేవతలతో పాటు ప్రార్థనా స్థలాలతో పేర్లు చెప్పి బీజేపీకి ఓట్లు అడిగారని పిటిషనర్ ఆరోపించారు. మోదీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆరేళ్ల పాటు అనర్హత వేటు వేయాలని పిటిషనర్ డిమాండ్ చేశారు.