ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్పై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. "భీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాలను జగన్ అడ్డుకోవాలని చూశారు. నేను వెళ్లి జగన్ను బతిమిలాడతాను అని అనుకున్నాడు. అవసరమైతే ఉచితంగా ఇంటర్నెట్లో సినిమాలను వదిలే వ్యక్తిని నేను. నా ఆత్మగౌరవాన్ని తగ్గించుకోను. వైసీపీని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతోంది." అని రాజోలు నియోజకవర్గం మలికిపురం సభలో పవన్ జోస్యం చెప్పారు.