గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో శనివారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ సీఎం టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు పుట్టినరోజు పురస్కరించుకొని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి కేక్ కట్ చేసి నారా చంద్రబాబునాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.