ట్రెండింగ్
Epaper    English    தமிழ்

21న టీడీపీ అభ్యర్థులకు చివరిగా బీ ఫారాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 02:55 PM

టీడీపీ నాయకత్వం కొన్ని స్థానాలలో అభ్యర్థుల మార్పు నిమిత్తం పూర్తి స్థాయిలో తమ అభ్యర్థులకు బీ ఫారాలను ఈ నెల 21న పంపిణీ చేయనుంది. తమ అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులను ఆ రోజున కేంద్ర కార్యాలయానికి పిలిపించి ఇవ్వాలని నిర్ణయించారు. అదే రోజు వారితో ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. కాగా.. శనివారం చంద్రబాబు పుట్టినరోజు. ఆయన ఆ రోజు నెల్లూరు జిల్లాలో ప్రజా గళం సభల్లో పాల్గొననున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. సర్వేపల్లి, ఆత్మకూరు, గూడూరు నియోజకవర్గాల్లో ఆయన సభలు ఉంటాయని అంటున్నారు. ఇప్పటివరకూ రోజుకు రెండు సభలు పెడుతున్నారు. ఆ రోజు మాత్రం మూడు పెట్టే ఆలోచన నడుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com