వారాహి విజయభేరి సభకు జనసేనా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి చేరుకున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్... జనసేనకు ఘనస్వాగతం పలికారు. ఈ యాత్రలో రాయి కలకలం రేగింది. తెనాలిలో పవన్ కళ్యాణ్ పై ఓ వ్యక్తి రాయి విసిరాడు. అయితే ఆ రాయి పవన్ కు తగలకుండా దూరంగా పడింది. రాయి విసిరిన వ్యక్తిని పట్టుకున్న జనసైనికులు అతడిని పోలీసులకు అప్పగించారు.