రాయదుర్గం పట్టణంలో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ఈద్గాల వద్దకు వెళ్లే ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా కరుణాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకున్నారు. వైసిపి నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.