ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డబ్ల్యూటీటీ: పోరాడి ఓడిన మనిక బత్రా

sports |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 09:06 AM

ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఛాంపియన్స్ లెవల్ టోర్నమెంట్‌లో భారత నంబర్ వన్ మనికా బాత్రా తొలి రౌండ్‌లోనే పరాజయం పాలైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 38వ ర్యాంకర్ మనిక 12-10, 9-11, 6-11, 11-8, 8-11తో ప్రపంచ ఆరో ర్యాంకర్ హీనా హయతా (జపాన్) చేతిలో ఓడిపోయింది.
47 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో మనికా బాత్రా కీలక సమయంలో తప్పిదాలు చేసి నిర్ణయాత్మక ఐదో సెట్ లో ఓటమి పాలైంది. తొలి రౌండ్‌లోనే ఓడిన మనిక బాత్రాకు 3,500 డాలర్లు (రూ. 2 లక్షల 91 వేలు) ప్రైజ్ మనీతోపాటు 15 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com