అరవింద్ కేజ్రీవాల్ నైతికతతో సీఎం పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ సూచించారు. ‘కేజ్రీవాల్ డబ్బులు తీసుకున్నారా, లేదా అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. కానీ సీఎం స్థాయి వ్యక్తి అవినీతి ఆరోపణలతో జైలుకెళ్లి,
అక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తాననడం తప్పుడు ధోరణిని సూచిస్తోంది. అది చట్టబద్ధం కాదు. ఆచరణాత్మకం కూడా కాదు. అందుకే ఆయన రాజీనామా చేయాలి’ అని పేర్కొన్నారు.