ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంజాబ్ కింగ్స్‌కు శుభవార్త

sports |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2024, 03:55 PM

ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ బెయిర్‌స్టో భారత్‌లో సుదీర్ఘ టెస్ట్ సిరీస్‌ను పూర్తి చేసి ఇటీవల స్వదేశానికి తిరిగి వచ్చినప్పటికీ మొత్తం ఐపిఎల్ సీజన్‌కు పంజాబ్ కింగ్స్ జట్టుకు అందుబాటులో ఉంటాడు. బెయిర్‌స్టో ఈ నెల 18 లేదా 19న భారత్‌కు రానున్నారు.
మార్చి 23న జరిగే పంజాబ్ తొలి మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడు’’ అని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్‌కు ఇంగ్లండ్ ఆటగాళ్లు అందుబాటులో ఉండటంపై ఐదో టెస్టు సందర్భంగా బీసీసీఐ అధికారులు ఈసీబీ అధికారులతో మాట్లాడారు. బెన్ స్టోక్స్, రూట్, మార్క్ వుడ్ ఇప్పటికే ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. మరోవైపు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వసీం జాఫర్‌ను కొనసాగించకూడదని పంజాబ్ ఫ్రాంచైజీ నిర్ణయించింది. జట్టు క్రికెట్ డైరెక్టర్ సంజయ్ బంగర్ ఈ సీజన్‌కు బ్యాటింగ్ కోచ్‌గా కూడా పని చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com